TG: నిజామాబాద్ నగరంలోని ఆరో టౌన్ పోలీస్ స్టేషన్లో ఓ యువకుడు బుధవారం ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అర్సపల్లికి చెందిన ఓ యువకుడిని గంజాయి కేసులో పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువకుడు పోలీస్ స్టేషన్ వాష్ రూంలో ఉన్న ఫినాయిల్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన పోలీసులు ఆస్పత్రిలో నిందితుడికి చికిత్స చేయించారు. అనంతరం యువకుడిని రిమాండ్‌కు తరలించారు.