జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామానికి చెందిన మునుగురి పవన్ (26) అనే యువకుడు కానిస్టేబుల్ ఉద్యోగం రాలేదని, తాను ఏ పని చేసినా సఫలం కావడంలేదని లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న పవన్, ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను లేఖలో పేర్కొన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.