బైక్‌తోపాటు బావిలో పడి యువకుడి మృతి

AP: బైక్‌పై వెళ్తూ ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో సోమవారం రాత్రి జరిగింది.  చిన్న కలికిరి గ్రామానికి చెందిన శేఖర్ (27) తాపీ మేస్త్రీ పనులు ముగించుకుని బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో బైక్‌కు రాళ్లు తగిలి అదుపు తప్పి వాహనంతోపాటు బావిలో పడి మృతి చెందాడు. స్థానికులు గమనించి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య, ఏడాదిన్నర వయసు కుమార్తె ఉంది. శేఖర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్