మెడపై గాయంతో యువకుడి మృతి.. శంషాబాద్‌లో కలకలం

TG: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆర్జీఐఏ పీఎస్ పరిధిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. తమిళనాడు పుడుకొట్టయ్ ప్రాంతానికి చెందిన చిన్నరాసు నారాయణ స్వామి అనే యువకుడు మధురానగర్ స్ట్రీట్ నెంబర్ 3లో మెడ పై బలమైన గాయంతో మృతి చెందాడని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ ను రప్పించి ఆధారాలను సేకరించారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్