కీసర ORRపై అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి(వీడియో)

TG: మేడ్చల్ జిల్లా కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడిని శాశామీర్‌పేట మండలం ఆలియాబాద్‌కు చెందిన శ్యామ్‌గా గుర్తించారు. శ్యామ్ వృత్తిరీత్యా ఫంక్షన్లలో వంటలు చేస్తూ జీవనం సాగించేవాడు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అయితే అతడిని ఎక్కడైనా చంపి మృతదేహాన్ని ఇక్కడ పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్