దేశం సుభిక్షంగా, అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే యువతే కీలకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో జరిగిన ‘యువ భారత్ రన్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువత స్వామి వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకోవాలని, మాదకద్రవ్యాలు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కోరారు.