వందేభారత్ రైలుపై రాళ్లు విసిరిన యువకుడు (వీడియో)

ముంబై సమీపంలోని ఠాకుర్లి, కళ్యాణ్ స్టేషన్ల మధ్య షిర్డీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై 23 ఏళ్ల ఓ యువకుడు రాళ్ళు విసిరాడు. ఈ ఘటనలో నాలుగు బోగీల (C1, C3, C4 మరియు C7) అద్దాలు ధ్వంసమయ్యాయి. నిందితుడిన అరెస్టు చేయగా నేరం అంగీకరించాడు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వివరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్