విజయనగరానికి చెందిన సూర్యకుమారి అనే మహిళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసి ఉద్యోగాల కోసం ప్రయత్నించి ఏజెంట్ చేతిలో మోసపోయిన తన ఇద్దరు కుమారులతో పాటు మరో ఆరుగురు యువకులు మయన్మార్ సరిహద్దుల్లో బందీలుగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ వెంటనే కేంద్ర విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడారు. మయన్మార్ సరిహద్దుల్లో చిక్కుకున్న 8 మంది తెలుగు యువకులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.