గంజాయి మత్తులో పోలీసులపై దాడి చేసిన యువకులు

TG: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు తండాలో పాత కక్షల నేపథ్యంలో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ తీవ్రమవడంతో డయల్ 100కి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను గంజాయి మత్తులో ఉన్న గుగులోత్ రవి, కుమార్ అడ్డుకున్నారు. వారి దాడిలో పోలీసులకు గాయాలయ్యాయి. కానిస్టేబుల్స్ ఫిర్యాదు మేరకు గుగులోత్ రవి, కుమార్, బానోత్ భాస్కర్, పద్మలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్