యూపీలోని నోయిడా సెక్టార్ 58లో మంగళవారం దారుణ ఘటన జరిగింది. ప్రధాన రహదారి నుండి సర్వీస్ లేన్‌లోకి వెళ్తుండగా ఒక కారు మరో కారును స్వల్పంగా ఢీకొట్టింది. ఇరు వాహనాలలోని వ్యక్తులకు వాగ్వాదం జరిగింది. తర్వాత ఓ కారు ఓనర్‌పై మరో కారులోని యువకులు దాడి చేశారు. రోడ్డుపైనే కింద పడేసి విచక్షణా రహితంగా కొట్టారు. కాళ్లతో కనికరం లేకుండా తన్నారు. చివరికి కొందరు స్థానికులు జోక్యం చేసుకుని దాడిని ఆపారు.