గంజాయి మత్తులో యువకుల బీభత్సం.. బస్సు ధ్వంసం, డ్రైవర్‌పై దాడి

హైదరాబాద్ నగరంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరుతున్నాయి. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో, కొత్తపేట మెట్రో పిల్లర్ 1629 వద్ద గంజాయి మత్తులో ఉన్న యువకులు పటాన్ చెరు నుండి ఏపీకి వెళ్తున్న ప్రైవేట్ బస్సును ధ్వంసం చేశారు. తమ కారుకు బస్సు తగిలిందని ఆరోపిస్తూ, డ్రైవర్‌పై దాడి చేసి, బస్సును ధ్వంసం చేశారు. బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్