ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో కారు రైడర్లు బహిరంగ గూండాల్లా వ్యవహరించారు. మూడు కార్లలో రోడ్డుపైకి వచ్చిన కొందరు యువకులు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రెచ్చిపోయారు. జిఎల్ బజాజ్ కళాశాల సమీపంలో 3 కార్లతో యువకులు విన్యాసాలు చేశారు. కారు కిటికీల్లోంచి కర్రలు పట్టుకుని ఊపారు. వారి దాడి నుంచి చాలా మంది పాదచారులు, పలు వాహనాలు తృటిలో తప్పించుకోవడం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.