ఉత్తర్‌ప్రదేశ్‌లో పలువురు యువకులు అత్యంత ప్రమాదకరంగా ట్రాక్టర్లతో విన్యాసాలు చేస్తూ రీల్స్ చేశారు. ఫరూఖాబాద్‌లో యువకులు రెండు ట్రాక్టర్లను తాళ్లతో కట్టి విన్యాసాలు చేశారు. రహదారిపై రెండు వేర్వేరు కంపెనీలకు చెందిన ట్రాక్టర్ల హార్స్‌పవర్‌ను పరీక్షిస్తూ వీడియో తీశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నవాబ్‌గంజ్ పోలీసులు సదరు యువకులపై రోడ్డు భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు.