AP: భారీ వర్షాలకు వరద నీటిలో యువకులు కొట్టుకుపోయారు. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట పరిధిలోని రాజాం వద్ద ఆర్టీ రోడ్డులో వరద నీరు మోకాళ్లు లోతులో ప్రవహిస్తుంది. రాజాంలో మరిడిమాంబ పండగ కావడంతో భక్తులు వాహనాల్లో అమ్మవారి దర్శనానికి వెళుతున్నారు. రోడ్డు దాటే క్రమంలో బైక్‌పై ఉన్న యువకులు నీటిలో కొంత దూరం కొట్టుకుపోయారు. స్థానికులు గుర్తించి వారిని సురక్షితంగా బయటకు లాగారు.