ప్రముఖ వీడియో ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ తన యూజర్లకు గుడ్ న్యూస్ అందించింది. ఎంపికైన వినియోగదారులకు 2 నెలల పాటు యూట్యూబ్ ప్రీమియం సేవలను ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్ ప్రధానంగా కొత్త యూజర్లకు వర్తించే అవకాశం ఉంది. ప్రీమియం ద్వారా యాడ్-ఫ్రీ వీడియోలు, బ్యాక్‌గ్రౌండ్ ప్లే, ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్స్, యూట్యూబ్ మ్యూజిక్ వంటి ఫీచర్లు లభిస్తాయి. ఈ ఆఫర్ పొందాలంటే యూట్యూబ్ యాప్‌లో ప్రొఫైల్ సెక్షన్‌లో “Get YouTube Premium” ఎంపికను చెక్ చేయాలి. ట్రయల్ ముగిసేలోపు రద్దు చేసుకుంటే ఎలాంటి ఛార్జీలు ఉండవు.