యూట్యూబర్ సౌరవ్ జోషి, ఆయన భార్య అవంతిక ఆర్థికంగా వెనుకబడిన పాఠశాల చిన్నారుల కోసం ఇండిగో విమానాన్ని పూర్తిగా బుక్ చేసి, వారికి జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని అందించారు. హల్ద్వానీ నుంచి నోయిడా వరకు జరిగిన ఈ ప్రయాణంలో, చిన్నారుల భయాన్ని పోగొట్టి ధైర్యం నింపారు. నోయిడాలో రెస్టారెంట్, గేమింగ్ జోన్‌లకు తీసుకెళ్లి, ఆటలు, పిజ్జాలతో ఆనందంగా గడిపేలా చేసి, సురక్షితంగా ఇళ్లకు చేర్చారు. ఈ దంపతుల మంచితనాన్ని, చిన్నారుల ముఖాల్లోని చిరునవ్వులను చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.