బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికార ఎన్డీయే 190కి పైగా సీట్లలో ఆధిక్యంలో నిలిచి, గెలుపు ఖాయం చేసుకుంది. మహాగఠ్‌బంధన్ కేవలం 36 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో బీహార్‌కు చెందిన యూట్యూబర్ రతన్ రంజన్, ఆర్జేడీ ఎన్నికల గుర్తు అయిన లాంతరును జేడీయూ గుర్తు అయిన బాణంతో పొడుస్తూ, ఆర్జేడీని అవహేళన చేస్తూ ఒక వీడియో రూపొందించారు. లాలూ ఆటవిక పాలనతో పోలిస్తే ఎన్డీయే పాలనలో అభివృద్ధి జరిగిందని, బీహార్ ప్రజలు అభివృద్ధికే ఓటేశారని ఆయన అన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.