AP: వల్లభనేని వంశీపై కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అన్యాయమని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. తనతో తప్పుడు కేసు పెట్టించారని యువకుడు వాంగ్మూలం ఇస్తే తట్టుకోలేక దుర్మార్గాలు చేస్తున్నారన్నారు. అలాగే డ్రైవర్ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని బూతులు తిడితే.. అబ్బయ్య చౌదరిపై కేసు పెట్టడం దారుణమన్నారు. టీడీపీ చేసే తప్పులను ప్రజలే తమ డైరీల్లో రికార్డు చేసుకుంటూనే ఉన్నారు. తగిన మూల్యం చెల్లించక తప్పదని వార్నింగ్ ఇచ్చారు.