AP: కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహానికి సంబంధించి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 24న వైఎస్ అంజిలి రెడ్డి-సోమల రఘురామ్ రెడ్డి నిశ్చితార్థం జరగనుందని అన్నారు. నవంబర్ 25న వివాహం, డిసెంబర్ 5న రిసెప్షన్ ఉంటుందని ఎక్స్ వేదికగా షర్మిల ప్రకటించారు. ఈ మేరకు తొలి పెళ్లి కార్డును వైఎస్సార్ ఘాట్ వద్ద పెట్టి మహానేత ఆశీస్సులు తీసుకున్నామని షర్మిల తెలిపారు.