తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చింది. జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, కుమార్తె వైఎస్ షర్మిల ఫోన్లు ఒకే సమయంలో ట్యాప్ అయినట్లు గురువారం అధికారులు గుర్తించారు. జగన్, షర్మిల మధ్య విభేదాల సమయంలో విజయమ్మ షర్మిల వైపు ఉన్న సంగతి తెలిసిందే. ఆ టైం లో విజయమ్మ ఫోన్ ట్యాప్ చేసి, వైసీపీలోని కీలక వ్యక్తికి సమాచారం అందించినట్లు సమాచారం. ఈ అంశంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.