ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న SIR ప్రక్రియపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఓడిపోతామని తెలిసిన చంద్రబాబు, SIR ద్వారా వైసీపీకి చెందిన ఓట్లను తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఓటరు జాబితా నుండి పేర్లు తొలగిస్తే ప్రజలు ప్రభుత్వ పథకాలకు అర్హత కోల్పోతారని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ సానుభూతిపరులకు ఫారాలు కూడా ఇవ్వకుండా BLOలే వాటిని నింపుతున్నారని ఆయన మండిపడ్డారు.