AP: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా బుధవారం కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద షర్మిల తన కుటుంబ సభ్యులు, అభిమానులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి నివాళులర్పించారు. జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలతో ప్రజలకు అండగా నిలిచిన వైఎస్సార్ సంక్షేమ పాలనను స్మరించుకున్నారు. కోట్లాది మంది ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచి ఉంటారని కొనియాడారు.