కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో భారత టెన్నిస్ క్రీడాకారుడు యూకీ బాంబ్రీ

భారత టెన్నిస్ క్రీడాకారుడు యూకీ భాంబ్రీ ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో తన కెరీర్‌లో అత్యుత్తమంగా 20వ ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మూడో రౌండ్ వరకు చేరుకోవడం ద్వారా లభించిన పాయింట్లు అతడిని ఈ అరుదైన మైలురాయికి చేర్చాయి. రోహన్ బోపన్న తర్వాత ఏటీపీ డబుల్స్ టాప్-20 ర్యాంక్ సాధించిన తొలి ఇండియన్‌గా యూకీ నిలిచాడు. గత ఏడాది కాలంగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న యూకీ, తన తొలి ఏటీపీ 500 టైటిల్‌ను గెలుచుకోవడంతో పాటు యూఎస్ ఓపెన్ సెమీఫైనల్స్ వరకు వెళ్ళాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్