హగ్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన యువరాజ్

భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నిర్వహిస్తున్న యూట్యూబ్ టాక్ షోలో పాల్గొని తనపై వచ్చిన లింకప్ రూమర్లపై స్పందించారు. తన మేనేజర్‌కు హగ్ ఇవ్వడాన్ని మీడియా వక్రీకరించి, మ్యాచ్ సమయంలో అమ్మాయిని కలిసినట్లు కథనాలు అల్లిందని ఆయన తెలిపారు. క్రికెటర్ల వ్యక్తిగత జీవితాలపై మీడియా అనవసర వివాదాలు సృష్టిస్తుందని, పాజిటివ్ కథనాల కంటే నెగెటివిటీనే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారని యువరాజ్ ఆరోపించారు. 2000లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి, 2019లో వీడ్కోలు పలికిన యువరాజ్, తన కెరీర్‌లో 11,000కిపైగా పరుగులు చేసి, 2011 వన్డే వరల్డ్‌కప్‌లో కీలక పాత్ర పోషించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్