ఇతర కంపెనీలపై ఆధారపడకుండా సొంత క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేసుకున్నట్లు జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తెలిపారు. డేటాబేస్, ఐడెంటిటీ, మెసేజింగ్, సెర్చ్, స్టోరేజ్, కంప్యూటింగ్ వంటి సేవలకు AWS, గూగుల్ క్లౌడ్ వంటి విదేశీ ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా దీన్ని రూపొందించినట్లు ఎక్స్‌లో వెల్లడించారు. డెవలపర్ల కోసం క్యాటలిస్ట్ సర్వర్‌లెస్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చామని, విద్యార్థులకు ఉచితంగా అందించాలని యోచిస్తున్నట్లు చెప్పారు.