సెల్ఫ్ డ్రైవ్ కార్ షేరింగ్ ప్లాట్‌ఫాం సేవల సంస్థ జూమ్‌కార్.. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌తో జట్టుకట్టింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంతో హైదరాబాద్‌తో పాటు 19 విమానాశ్రయాల్లో నేరుగా సెల్ఫ్-డ్రైవ్ కారును బుకింగ్ చేసుకునే వీలుంటుంది. విమానాశ్రయాల్లో దిగిన తర్వాత క్యాబ్ కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని, ఎయిర్‌లైన్స్‌కు చెందిన మొబైల్ యాప్ ద్వారానే తమకు నచ్చిన కారును బుకింగ్ చేసుకునే వీలుంటుంది.