యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి (వీడియో)
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ-ఆగ్రా హైవేపై ఛటా షుగర్ మిల్లు సమీపంలో ట్రాక్టర్, డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, ఒకరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తరలించారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.