AP: కులం పేరుతో దూషిస్తూ వేధిస్తున్నారంటూ ఓ కానిస్టేబుల్ ఆరోపిస్తున్న ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. మార్కాపురం పీఎస్‌కు చెందిన శంకర్ నాయక్ అనే కానిస్టేబుల్.. తనను ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులు కులం పేరుతో దూషిస్తున్నాడంటూ ఎక్సైజ్ ఆఫీసు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టాడు. అంతేగాకుండా సంబంధం లేని విధులు అప్పగిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అధికారులు న్యాయం చేయాలంటూ కోరుతున్నాడు.