మధ్యప్రదేశ్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. గుణ జిల్లాలోని రఘోఘర్‌లో సుమిత్ మీనా (10) అనే బాలుడు బోరుబావిలో పడి సుమారు 39 అడుగుల లోతులో చిక్కుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది, కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవర్ధన్ సింగ్ సహాయక చర్యలు చేపట్టారు. కాగా, బోర్‌వెల్ దాదాపు 140 అడుగుల లోతులో ఉందని గుణ కలెక్టర్ సతేంద్ర సింగ్ తెలిపారు.