
గ్రూప్-2 అభ్యర్థులు 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి: APPSC
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ఆదివారం యథాతథంగా జరుగుతాయని APPSC తెలిపింది. షెడ్యూల్ ప్రకారం.. ఉ.10 గంటల నుంచి మ.12.30 గంటల వరకు పేపర్-1, మ.3 గంటల నుంచి సా.5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుందని ఏపీపీఎస్సీ అధికారులు ధ్రువీకరించారు. అభ్యర్థులు 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా..92,250 మంది మెయిన్స్ పరీక్షకు హాజరు కానున్నారు.