గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు విశాఖలో ఆందోళనకు దిగారు. దాదాపు రెండు గంటలుగా ఇసుకతోట కూడలి వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి 'సీఎం డౌన్ డౌన్' అంటూ ధర్నాకు దిగారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విశాఖ వ్యాలీ జంక్షన్ వరకు వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ట్రాఫిక్ మళ్లింపునకు పోలీసులు చర్యలు చేపట్టారు.