
ఏపీలో 51 మండలాల్లో వడగాల్పులు
ఏపీలో ఎండలు దంచేస్తున్నాయి. వానలతో చల్లబడిన భానుడు.. వేడితో తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా సరాసరి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సోమవారం(నేడు) కూడా 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 20 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది ఇలా ఉంటే రాబోయే మూడు రోజులు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావారణ శాఖ పేర్కొంది.