ఏపీలోని NTR జిల్లా ఏ. కొండూరు మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. నిండి గర్భిణి అయిన MPDO హరిప్రియ మంగళవారం రాత్రి కాన్పు కోసం విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చేరింది. గుండెకు సంబంధించిన వ్యాధి ఉండటంతో అనారోగ్యానికి గురై చికిత్స తీసుకుంటూనే పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. కనులారా బిడ్డను చూడకుండానే ఆమె తుదిశ్వాస విడిచారు. 2018లో గ్రూప్-1లో MPDO ఉద్యోగం సాధించి తూ.గో జిల్లాలో బాధ్యతలు నిర్వహించారు. ఈ ఏడాది అక్టోబర్ 9నుంచి ఏ.కొండూరు MPDOగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.