కీబోర్డుపై F – J లెటర్స్ కింద ఒక గీత ఎందుకు ఉంటుందో తెలుసా?
కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల కీబోర్డుపై F, J బటన్ల మీద ఒక చిన్న గుర్తులు ఉంటాయి. అవి టైపింగ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ లైన్ల యొక్క ముఖ్య ఉద్దేశ్యం టైపింగ్ వేగాన్ని పెంచడం, కీబోర్డ్‌ను చూడకుండా వేగంగా టైప్ చేయడంలో సహాయపడతాయి. ఎడమ చేతి చూపుడు వేలును F బటన్‌పై ఉంచి, కుడి చేతి చూపుడు వేలును J బటన్‌పై ఉంచినట్లయితే, మిగిలిన వేళ్లు చాలా ఈజీగా సరైన ప్రదేశానికి కదులుతాయి. ఇది టైపింగ్ వేగాన్ని పెంచుతుంది.