అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న వివాద్ సే విశ్వాస్ 2.0 పథకం
ప్రత్యక్ష పన్ను వివాదాలను పరిష్కరించే దిశగా తీసుకొచ్చిన వివాద్ సే విశ్వాస్ 2.0 పథకం అమలు తేదీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి ఈ పథకం అమల్లోకి రానున్నట్లు శుక్రవారం తెలిపింది. ప్రత్యక్ష పన్నులకు సంబంధించి వివిధ న్యాయ వేదికల్లో రూ.35 లక్షల కోట్ల విలువైన 2.7 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలైలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకం గురించి ప్రకటించిన సంగతి తెలిసిందే.