మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను చూస్తే కడుపు నిండుతుంది: హరీష్ రావు (వీడియో)

59చూసినవారు
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఉన్న మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిండుకుండలా ఉన్న మల్లన్న సాగర్‌ను చూస్తుంటే తనకు కడుపు నిండిన అనుభూతి కలుగుతున్నదని ఆయన అన్నారు. మల్లన్న సాగర్‌ నిండుగా ఒక సముద్రంలా కనబడుతున్నదని ఆనందం వ్యక్తం చేశారు. కొంత మంది నాయకులు కాళేశ్వరం కొట్టుకుపోయిందని అసత్యపు ప్రచారాలు చేస్తున్నా వారికి ఇది ఒక చెంపపెట్టు లాంటిదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్