ధర్మవరం: సైనికుడికి నివాళులు అర్పించిన వైకాపా నాయకులు
ధర్మవరం పట్టణానికి చెందిన బిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణారెడ్డి బుధవారం జమ్మూ కాశ్మీర్ బోర్డర్ లో గుండెపోటుతో మృతి చెందాడు. సైనిక అధికారులు వెంకటరమణారెడ్డి భౌతిక దేహాన్ని ధర్మవరం పట్టణంలోని నాగుల బావి వీధిలో ఉన్న ఆయన స్వగృహానికి శుక్రవారం తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు గుర్రం శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్ బ్రమ్మయ్య సైనికుడి మృతదేహానికి నివాళులర్పించారు.