ధర్మవరం: గొట్లూరు పీహెచ్సీని తనిఖీ చేసిన వైద్యాధికారి
ధర్మవరం మండలం గొట్లూరులోని పీహెచ్సీని వైద్యాధికారి పుష్పలత బుధవారం తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రం పరిధిలో కుష్టు వ్యాధిపై సర్వే ఎలా నిర్వహిస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి కుష్టు వ్యాధిపై తప్పనిసరిగా సర్వే నిర్వహించి, రికార్డుల్లో పొందుపరచాలని సిబ్బందికి సూచించారు.