మడకశిర: ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సి
అమరాపురం మండలం శివారం గ్రామంలో డాక్టర్ ధనుంజయ్ ఎస్ ఎస్ ఎం హాస్పిటల్ బెంగళూరు వారిచే ఆదివారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఉచిత వైద్య శిబిరంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గణేష్ మాజీ జడ్పీటీసీ నరసింహమూర్తి, రఘువీర, మల్లప్ప, రంగస్వామి, ఆనంద్ కృష్ణ, రమేష్, నరేష్, రఘు, ఈరన్న, ప్రభాకర్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.