సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ను అందజేసిన మడకశిర ఎమ్మెల్యే
మడకశిర పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో మంగళవారం మడకశిర నియోజకవర్గం శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు ఎం ఎస్ రాజు 16 మంది అర్హులైన లబ్ధిదారులకు దాదాపు 20 లక్షల రూపాయల సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో మడకశిర టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, లబ్దిదారులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.