పెనుకొండ: ఆశ వర్కర్స్ కు కనీస వేతనం ఇవ్వాలి: సీఐటీయూ
పెనుకొండ మండలం గుట్టూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా వర్కర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ జిల్లా కమిటీ పిలుపు మేరకు ఆశాలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని ఈ నెల 18వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు పుల్లమ్మ, సుమంగళి, రాజేశ్వరి, అలివేలమ్మ, తులసి, నాగమణి తదితరులు పాల్గొన్నారు.