
పెనుకొండ: పేదప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పరిటాల
పెనుకొండ పట్టణంలోని మడకశిర రోడ్డులోని హిందూపురం పార్లమెంట్ సభ్యుల కార్యాలయంలో మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 20వ వర్ధంతి సందర్భంగా అయన చిత్రపటానికి ఎంపీ బీ. కె. పార్థసారథి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ పేద ప్రజలు కోసం పోరాడి వారికి అండగా నిలిచి ప్రజల గుండెల్లో పరిటాల రవీంద్ర చిరస్థాయిగా నిలిచారన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.