టూ వీలర్ మెకానిక్లకు ఎస్ఐ హెచ్చరిక
సోమందేపల్లి మండలంలో గల టూ వీలర్ మెకానిక్ ల తో ఎస్ఐ రమేష్ సోమవారం సమావేశం నిర్వహించారు. అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు, అధిక శబ్దం వచ్చే హారన్ లు బిగించరాదని వారికి తెలిపారు. అలా కాదని ఎవరైనా బిగిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మండలంలో ఎవరైనా నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే వాటిని సీజ్ చేస్తామన్నారు. ఎవరైనా ఒరిజినల్ రికార్డులు లేని బైకులు కొంటే చర్యలు తీసుకుంటామన్నారు.