సోమందేపల్లి: ఘనంగా కబడ్డీ పోటీలు
సోమందేపల్లిలోని పాత హై స్కూల్ ప్రాంగణంలో సోమవారం స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన కబడ్డీ పోటీల్లో అనంతపురం ఆర్డిటి టీం విజేతగా నిలిచింది, బెంగళూరుకు చెందిన జై కిసాన్ టీం రన్నర్ నిలిచింది. ఇరు టీంలకు ట్రోఫితో పాటు విజేతలకు రూ.15 వేలు, రన్నర్స్ కి 10 వేల నగదు అందించారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ డి.సి అశోక్, ఎస్ఐ రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.