తాడిపత్రి: గజవాహనంపై వేంకటరమణుడి వైభవం
తాడిపత్రిలోని చింతలరాయుని ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా కొనసాగాయి. శ్రీదేవి, భూదేవి సమేత చింతల వెంకటరమణస్వామిని పట్టువస్త్రాలతో అలంకరించి ఉదయం సర్వభూపాల వాహనం, సాయంత్రం గజవా హనంపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. తాడిపత్రిలోని వందన డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.