యాడికి: ప్రమాదం జరిగినసిమెంట్ ఫ్యాక్టరీని పరిశీలించిన ఆర్డీవో
యాడికి మండలం బోయరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని సిమెంట్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి ప్రమాదం జరిగి ఒక కార్మికుడు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. గుంతకల్లు ఆర్డీవో శ్రీనివాసులు, యాడికి తహసీల్దార్ ప్రతాప్ రెడ్డి గురువారం ఆ సిమెంట్ ఫ్యాక్టరీని పరిశీలించారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలపై ఆరా తీశారు. స్థానికులు, కార్మికులను విచారించారు.