తాడిపత్రి: మట్కా నిర్వాహకుడి అరెస్టు
తాడిపత్రిలోని గాంధీకట్ట కాలనీలో మట్కా కాస్తున్న బీటర్ ను అరెస్టు చేసినట్లు సీఐ సాయిప్రసాద్ సోమవారం తెలిపారు. స్థానిక సమాచారం మేరకు పోలీసులతో దాడులు నిర్వహించగా రజాక్ అనే వ్యక్తిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి రూ. 70వేలు నగదు, మట్కా చిట్టీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టణంలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.