తాడిపత్రి: రోడ్డు ప్రమాదంలో యువతి మృతి
తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గీత (24) అనే యువతి మృతి చెందింది. గీత అతని సోదరుడు నారాయణరెడ్డి ఇద్దరూ కలిసి వెంకటరెడ్డిపల్లికి బైక్ పై వెళ్తుండగా బండలలోడుతో వస్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు వారిని ఢీ కొంది. ఈ సంఘటనలో గీత అక్కడికక్కడే మృతి చెందగా నారాయణరెడ్డి కి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.