

సీఎం చంద్రబాబుకు షాకిచ్చిన విద్యార్థిని (వీడియో)
AP: ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’లో భాగంగా నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబుకు దీప్తి అనే విద్యార్థిని షాకిచ్చింది. ‘అందరూ స్వచ్ఛత గురించి మాట్లాడుతున్నారు. కానీ ఎవరూ పాటించడం లేదు. కందుకూరులో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయి ఉంది. ఇవాళ సీఎం వస్తున్నారని చెత్తను తొలగించారు. రోజూ ఇలాగే చెత్త తొలగిస్తే బాగుంటుంది.’ అని దీప్తి కోరింది.