భారత మాజీ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ (92) పార్థివ దేహాన్ని ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ రోడ్డులో ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. మన్మోహన్ భౌతికకాయంపై జాతీయ జెండాను గౌరవప్రదంగా కప్పడం జరిగింది. ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో శనివారం ఉదయం 11.45 గంటలకు ఆయన అంతిమ సంస్కారాలు జరుగనున్నాయి.